పవన్ ‘పింక్’రీమేక్ రిలీజ్ డేట్ చెప్పేసిన దిల్ రాజు..

48
Dil Raju
Dil Raju

జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు :  దిల్‌రాజు 
శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ…

రీమేక్‌ల‌కు మీరు వ్య‌తిరేక‌మా?
– రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని.  అలా ట్రావెల్ చేస్తే ఆ మేజిక్ బావుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఆలోచించ‌లేదు. మ‌ధ్య‌లో `ప్రేమ‌మ్‌`, `బెంగ‌ళూర్ డేస్` చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా `బెంగళూరు డేస్` సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా వ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, శ‌ర్వా ఇద్ద‌రూ ఆ సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. త‌ర్వాత `ప్రేమ‌మ్` చేద్దామ‌ని అనుకుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ అన్నా! నేను రీమేక్ చేసుకుంటా అన్నాడు. స‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి. ఈ సినిమాను మ‌నం మిస్ అవ‌కూడ‌ద‌నే ఫీలింగ్ వ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా ఈ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నాం. త‌మిళ `96` చిత్రాన్ని తెలుగులో `జాను`గా రీమేక్ చేస్తుంటే..తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ మూడు హార్ట్  ట‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా. `జాను` విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్రం `96` టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌టి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, హ‌రి సినిమా చూశాం. నాకు త‌మిళంలో పెద్ద‌గా అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌గా ఎక్కేసింది. థియేటర్ బ‌య‌ట‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది. 

`పింక్‌` రీమేక్ గురించి?

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటే ఇప్ప‌టికి కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాది టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. `వి` సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను మ‌రో కోణంలో చూపిస్తాం.