హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం..

43
Sriknath
Sriknath


ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకా వారి పాలెం లో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

సోమ‌వారం (ఫిబ్ర‌వ‌రి 17న‌) మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.