సంక్రాంతి రికార్డుల పోరాటం

206

సంక్రాంతి పండుగ వచ్చింది వెళ్ళింది. కానీ సంక్రాంతి సినిమాల హడావిడి మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు‌. సినిమాల సక్సెస్ కోసం కాకుండా ఇప్పుడు రికార్డుల కోసం పోరాటం జరుగుతోంది. నిజానికి తెలుగులో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రధానంగా విడుదలైతే అందులో రెండు పెద్ద సినిమాలు రికార్డులో పోరాటంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురములో… ఒకవైపు, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు… మరోవైపు సంక్రాంతికి అసలు సిసలు విజేత మేము అంటే మేము అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి‌. బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల కలెక్షన్లు బాగున్నా, అల వైకుంఠ పురములో సినిమాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అల్లు అర్జున్ సినిమాకే ఎక్కువ ఉన్నట్టు బాక్సాఫీస్ పండితుల లెక్క.