వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ దిమ్మ‌తిరిగే బిజినెస్.. స్టార్ హీరోల‌ను మించి…

183
Vijay Deverakonda
Vijay Deverkonda as World Famous Lover

సూప‌ర్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వరి 14వ తేదీన రిలీజ్‌కు సిద్ద‌మైంది. ప్రేమికుల రోజు కానుక‌గా వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే అత్యంత ప్రజాద‌ర‌ణ పొందాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. రిలీజ్ కు ముందు ఈ చిత్రం ఎంత బిజినెస్ చేసిందంటే..

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ నైజాంలో 9 కోట్ల రూపాయ‌లు, సీడెడ్లో 4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు, బిజినెస్ చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి 23 కోట్లు బిజినెస్ చేయ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
ఙ‌క క‌ర్ణాట‌క‌, మిగితా రాష్ట్రాల్లో థియేట్రిక‌ల్ హ‌క్కులు 4 కోట్ల‌కు, ఓవ‌ర్సీస్‌లో రూ.3.5 కోట్లు చేసింది. మొత్తంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రూ.30.5 కోట్ల బిజినెస్ కావ‌డం విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ స్టామినాను చెప్ప‌క‌నే చెప్పింది.

ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ హిట్ కొట్టాలంటే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.32 కోట్ల మేర బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ను న‌మోదు చేయాలి. ఏపీ, తెలంగాణ‌లో సుమారు 24 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది.