వరల్డ్ ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్స్ .. ఊహించ‌ని షాక్‌

175
World famous Lover
World famous Lover

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్రాల‌తో క్రేజీ స్టార్‌గా పేరుతెచ్చుకొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ప్ర‌స్తుతం అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బొక్కా బోర్లా ప‌డింది. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ కూడా సినిమాను నిల‌బెట్ట‌లేక‌పోయింది. దారుణంగా వారం కంటే ముందే సినిమాను థియేట‌ర్ల‌లో నుంచి ఎత్తేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశ‌మైంది. గ‌తేడాది డియ‌ర్ కామ్రేడ్‌తో మెప్పించ‌లేక‌పోయిన విజ‌య్ ఇప్పుడు డిఫెన్స్‌లో ప‌డ్డే అవ‌కాశం ఉంది.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌
నైజాంలో 9 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్ల మేర‌కు ముంద‌స్తు బిజినెస్ చేసింది. ఓవ‌రాల్‌గా ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం 23 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్, తెలుగేత‌ర రాష్ట్రాల‌తో క‌లిపి 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది.

వ‌ర‌ల్డ్‌ ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్స్..

నైజాం – 3.60 కోట్లు
సీడెడ్ – 70 లక్ష‌లు
ఉత్తరాంద్ర – 75 లక్ష‌లు
గుంటూరు – 62 లక్ష‌లు
తూర్పు గోదావరి – 50 లక్ష‌లు
పశ్చిమ గోదావరి – 35 లక్ష‌లు
కృష్ణా – 50 లక్ష‌లు
నెల్లూరు – 27 లక్ష‌లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ = 7.29 కోట్లు

కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా = 75 లక్ష‌లు
ఓవర్సీస్ – 1.05 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ = 9.09 కోట్లు.

దీంతో ఈ చిత్రం మొత్తంగా థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా చూస్తే సుమారు 21 కోట్ల మేర న‌ష్టాల్లో కూరుకుపోయింది. ఇటీవ‌ల కాలంలో తెలుగులో ఇంత ఘోరంగా సినిమా ఫ్లాప్ కావ‌డం ఇదే అనిపిస్తున్న‌ది.