Jaanu 2 days Collections: హిట్ కొట్టాలంటే ఎంత వ‌సూలు చేయాలి…

172
jaanu Collections
jaanu Collections

శ‌ర్వానంద్‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం రొమాంటిక్‌ ఫీల్ గుడ్ డ్రామా జాను బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్న‌ది. తొలి వారాంతం త‌ర్వాత సినిమా నిల‌క‌డ‌గా రాబ‌ట్టే వ‌సూళ్ల‌ను బ‌ట్టే జాను హిట్ రేంజ్ తెలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. గ‌త రెండు రోజుల్లో జాను ఎంత వ‌సూలు చేసిందంటే..

జాను 2వ రోజు వ‌సూళ్లు
నైజాంలో రూ.73 ల‌క్ష‌లు,
సీడెడ్‌లో 21 ల‌క్షలు,
ఉత్త‌రాంధ్ర‌లో 25 లక్ష‌లు,
తూర్పు గోదావ‌రి జిల్లాలో 8 లక్ష‌లు,
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రూ.8 లక్ష‌లు,
గుంటూరులో రూ.11 ల‌క్ష‌లు,
క్రిష్ణా జిల్లాలో 12.3 ల‌క్ష‌లు,
నెల్లూరులో రూ.5 ల‌క్ష‌లతో మొత్తంగా 1.64 కోట్లు న‌మోదు చేసింది.

జాను 2 రోజుల‌ వ‌సూళ్లు
నైజాంలో రూ.1.61 కోట్లు
సీడెడ్‌లో 49 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌లో 57 లక్ష‌లు,
తూర్పు గోదావ‌రి జిల్లాలో 26 లక్ష‌లు,
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రూ.18 లక్ష‌లు,
గుంటూరులో రూ.37 ల‌క్ష‌లు,
క్రిష్ణా జిల్లాలో 27 ల‌క్ష‌లు,
నెల్లూరులో రూ.11 ల‌క్ష‌లతో మొత్తంగా 3.86 కోట్లు రాబ‌ట్టింది.

ఇక క‌ర్ణాట‌క‌, ఇతర రాష్ట్రాల్లో రూ.30 ల‌క్ష‌లు,
ఓవ‌ర్సీస్‌లో రూ.64 ల‌క్ష‌లు క‌లెక్ష‌న్లు న‌మోదు చేసింది. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.4.80 కోట్ల షేర్‌, 8.70 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.18.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 19.2 కోట్లు వ‌సూలు చేయాల్సి ఉంది.