Aswathama 7 days collections.. ఇంకా న‌ష్టాల్లోనే..

22
Aswathama
ashwathama collections

హీరో నాగ‌శౌర్య న‌టించిన అశ్వ‌త్థామ చిత్రం తొలివారాంతం త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు రాబట్ట‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతున్న‌ది. రిలీజ్ డే రోజున మిశ్ర‌మ స్పంద‌న‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం తొలివారం త‌ర్వాత ఎంత రాబ‌ట్టిందంటే…

నాగశౌర్య స్వ‌యంగా క‌థ అందించిన అశ్వ‌త్థామ చిత్రం 7వ రోజున నైజాంలో రూ.4 ల‌క్ష‌లు, సీడెడ్‌లో 40 వేలు, ఉత్త‌రాంధ్ర‌లో 1.4 లక్ష‌లు, తూర్పు గోదావ‌రి జిల్లాలో 1 లక్ష‌లు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రూ.70 లక్ష‌లు, గుంటూరులో రూ.1.1 ల‌క్ష‌లు, క్రిష్ణా జిల్లాలో 1.2 ల‌క్ష‌లు, నెల్లూరులో రూ.50 వేలతో మొత్తంగా 10 ల‌క్ష‌లు రాబ‌ట్టింది.

అశ్వ‌త్థామ చిత్రం ఓవ‌రాల్‌గా 7 రోజుల్లో నైజాంలో రూ.1.43 కోట్లు, సీడెడ్‌లో 45 ల‌క్షలు, ఉత్త‌రాంధ్ర‌లో 65 లక్ష‌లు, తూర్పు గోదావ‌రి జిల్లాలో 28 లక్ష‌లు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రూ.21 లక్ష‌లు, గుంటూరులో రూ.26 ల‌క్ష‌లు, క్రిష్ణా జిల్లాలో 29 ల‌క్ష‌లు, నెల్లూరులో రూ.15 ల‌క్ష‌లతో మొత్తంగా 3.72 కోట్లు న‌మోదు చేసింది.

ఇక క‌ర్ణాట‌క‌, ఇతర రాష్ట్రాల్లో రూ.28 ల‌క్ష‌లు, ఓవ‌ర్సీస్‌లో రూ.56 ల‌క్ష‌లు క‌లెక్ష‌న్లు న‌మోదు చేసింది. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.4.56 కోట్ల షేర్‌, 7.42 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.6.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ గా నిలువ‌లాంటే బాక్సాఫీస్ వ‌ద్ద 7.2 కోట్లు వ‌సూలు చేయాల్సి ఉంది. అంటే బాక్సాఫీస్ వ‌ద్ద 2.5 కోట్ల‌కుపైగా రాబ‌ట్టాల్సి ఉంది.