రవితేజకు ఊహించని షాక్.. డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్లు..

0

మాస్ మహారాజా రవితేజ, సెన్సేషనల్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య రిలీజైన డిస్కో రాజా చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను మూటగట్టుకొన్నది. అయితే రవితేజ క్రేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాంలో డిస్కో రాజా చిత్రం రూ.1.08 కోట్లు
సీడెడ్‌లో రూ.36 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.31 లక్షలు
ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.19 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.15 లక్షలు
గుంటూరులో రూ.18 లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.18 లక్షలు
నెల్లూరులో రూ.10 లక్షలు వసూలు చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రలో కలిపి రూ.2.54 కోట్లు వసూలు చేసింది.

ఇక తెలుగేతర రాష్ట్రాలైన కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.22 లక్షలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అంతేకాకుండా ఓవర్సీస్‌లో డిస్కో రాజా చిత్రం రూ.13 లక్షలు వసూలు చేసింది.

ఓవరాల్‌గా ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.89 కోట్లు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.